Site icon PRASHNA AYUDHAM

మున్సిపల్ ఉద్యోగి ఫిట్టర్ పై విచారణ పూర్తి- ఆర్డి మసూద్

IMG 20250409 WA0030

*మున్సిపల్ ఉద్యోగి ఫిట్టర్ పై విచారణ పూర్తి*

*ఆర్డీ.ఏంఏ షాహిద్ మసూద్*

*జమ్మికుంట ఏప్రిల్ 9 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఫిట్టర్ గా విధులు నిర్వహిస్తున్న సంపత్ రావు తప్పుడు ధృవపత్రాలు పెట్టి ఉద్యోగం చేస్తున్నాడని అతనిపై విచారణ చేయాలని జమ్మికుంట పట్టణానికి చెందిన పబ్బు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన అధికారులు బుధవారం రోజున జమ్మికుంట మున్సిపాలిటీలో ఆర్డి. ఎంఏ షాహిద్ మసూద్ విచారణ చేపట్టారు.సంపత్ రావు, ఫిర్యాదు దారు పబ్బు శ్రీనివాస్ ల స్టేట్మెంట్లను రికార్డు చేసి పూర్తిగా విచారణ నిర్వహించారు. ఫిట్టర్ విధులకు కావలసిన ఎటువంటి పత్రాలు లేకండా విధులు నిర్వహిస్తున్నారని, ఇచ్చిన ఫిర్యాదు అధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు సంపత్ రావు యొక్క ఐటిఐ సర్టిఫికేట్ పరిశీలన చేసి ఆర్డీ.ఏంఏ షాహిద్ మసూద్ మాట్లాడుతూ పూర్తి నివేదకను సి.డి.ఏం. ఏ. అధికారి హైదరాబాద్ కి అందజేయనునట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ మొహమ్మద్ ఆయాజ్, మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్డి ఆఫీస్ మేనేజర్ గుర్రపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version