*ఏపీలో నేటి అర్ధరాత్రి నుంచి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె*
అమరావతి :
ఏపీలో తమ డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసనగా శనివారం అర్ధరాత్రి నుంచి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) అధ్యక్షులు కె నాగభూషణ, ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జిఓ 36 ప్రకారం వేతనాలు పెంచి చెల్లించాలని, కేటగిరీల నిర్ణయంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని, షరతులు లేకుండా కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలకు జిఓలు జారీ చేయాలని, వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యూటీ చెల్లించాలని పేర్కొన్నారు.