మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి
జమ్మికుంట ఆగస్టు 26 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం మట్టి విగ్రహాలను పంపిణీ నిర్వహించారు మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి భాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సీసం, క్రోమియం, పాదరసం వంటి మూలకాలు భూమిలో చేరడం వల్ల మానవుడు తీసుకొనే ఆహారం తో మనిషిలోకి విష రసాయానాలు చేరుతున్నాయన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ తో తయారు చేసే విగ్రహలు నీటిలో కరగడానికి సంవత్సరాలు పడుతుందని మట్టి తో తయారు చేసే విగ్రహాలు నీటిలో త్వరగా కరుగుతాయన్నారు. మట్టి గణపతులను వినియోగించే విధంగా ప్రజలు, ఆర్పీలు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సీనియర్ అసిస్టెంట్ లు భాస్కర్, వాణి, ఈ ఈ శ్రీకాంత్, వార్డు ఆఫీసర్లు, ఆర్పి లతో పరిశుద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు.