మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లంచం కేసులో ఏసీబీ వలలో
రూ.7 వేల లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్ పట్టివేత
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు కలకలం
ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆపరేషన్
అవినీతి మచ్చపై మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి
నిజామాబాద్ క్రైమ్, సెప్టెంబర్ 3 (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి కొత్తగా బయటపడింది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసచారి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ స్వయంగా నడిపించారు. రూ.7 వేల లంచం స్వీకరణపై ఫిర్యాదు రావడంతో, ఏసీబీ ముందస్తు ప్రణాళికతో దాడులు జరిపింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన అవినీతి పరంపరను బహిర్గతం చేస్తోంది. అధికార వర్గాల్లో కలకలం రేపిన ఈ కేసులో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.