కామరెడ్డి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ను ముట్టడించిన మున్సిపల్ కార్మికులు 

కామరెడ్డి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ను ముట్టడించిన మున్సిపల్ కార్మికులు

 

– మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

 

కామరెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 19

 

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్, మున్సిపల్ యూనియన్ ( సిఐటియు ) జిల్లా అధ్యక్షులు కే రాజనర్సు లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు మున్సిపల్ కమిషనర్ కు, మున్సిపల్ ఎస్ఐలకు వినతి పత్రాలు ఇచ్చిన సమస్యలు పరిష్కరించకపోవడంతో దానికి తోడు కార్మికులకు కొత్త సమస్య లు తీసుకురావడం వలన ఆగ్రహించిన మున్సిపల్ కార్మికులు మున్సిపల్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో మున్సిపల్ కార్మికులందరూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ను ముట్టడించడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్మికులకు రావలసిన నెలకు నాలుగు సెలవులను ఆదివారం నాడు రద్దు చేశారని, ఆరోగ్యరీత్యా లేదా కుటుంబ సమస్యలతో ఉన్న కార్మికుడికి బదిలీ పెట్టుకున్న అవకాశాన్ని కల్పించాలని, పాత కార్మికులను తీసుకోవాలని అన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు, ఆటో ల డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేయించాలని, అలాగే బండ్లను ఫిట్నెస్ చేపియాలని వారు డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన కమిషనర్ రాజేందర్ రెడ్డి ఆదివారం సెలవు ఇస్తానని, కార్మికుల యొక్క పిఎఫ్, ఈఎస్ఐ తొందరగా క్లియర్ చేస్తానని, బండ్లను ఫిట్నెస్ చేసి చేయిస్తానని, బదిలీ పెట్టుకునే అవకాశాన్ని సంబంధ అధికారులు తెలుసుకొని పెట్టుకునే అవకాశం కల్పిస్తానని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు వారింట్లో ఉద్యోగం పెట్టుకునే విధంగా చూస్తానని వారు మాట ఇవ్వడంతో ఈ ముట్టడిని తాత్కాలి ఆపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మూదం అరుణ్ కుమార్, మున్సిపల్ యూనియన్ నాయకులు సంతోష్, దీవెన, శివరాజవ్వ, సావిత్రి, ఇంద్ర, బైండ్ల సులోచన, జ్యోతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now