మున్సిపల్ కార్మికులను యధావిధిగా విధుల్లోకి తీసుకోవాలి.

మున్సిపల్ కార్మికులను యధావిధిగా విధుల్లోకి తీసుకోవాలి.

 

– మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందజేత

 

– మున్సిపల్ కమిషనర్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

 

– మున్సిపల్ కార్మికుల సంఘం ( సిఐటియు ) జిల్లా అధ్యక్షులు రాజనర్సు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 8

 

విధుల నుండి తొలగించిన మునిసిపల్ కార్మికులను యధావిధిగా విధుల్లోకి తీసుకోవాలని, కామారెడ్డి మున్సిపల్ కార్మికుల సమస్యల పైన మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి కి వినతి పత్రం మంగళవారం అందజేయడం జరిగిందని మున్సిపల్ కార్మికుల సంఘం ( సిఐటియు ) జిల్లా అధ్యక్షులు రాజనర్సు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ఈ మధ్యకాలంలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ అమలు కావడం లేదన్నారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలోనీ వారసులకు ఉద్యోగం ఇవ్వాలని జీవో ఉన్నది దీన్ని అమలు చేయాలనీ కమిషనర్ను కోరమన్నారు. ఆరోగ్యం బాగాలేక, ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేక గత రెండు నెలల నుంచి బంద్ అయిన పాత కార్మికులను యధావిధిగా విధుల్లోకి తీసుకోవాలని, ఆ సమయంలో వీళ్ళ స్థానం లో బదిలీ పెట్టుకునే అవకాశాన్ని ఇస్తే వాళ్లకు ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోవు అప్పుడు ఉన్న అధికారులు ఎస్సైలు మీ పరిస్థితులు చక్కా బడ్డాక మీ ఆరోగ్యాలు బాగా అయినంక రండి డ్యూటీలోకి తీసుకుంటామని వారికి అధికారులు ఎస్సైలు చెప్పడం వలన బదిలీ పెట్టుకుని అవకాశం కల్పించలేదన్నారు. ఈ మధ్యకాలంలో కమిషనర్లు అధికారులు మారడం వలన వారికి ఈ పరిస్థితి వచ్చినదన్నారు. వీరు గత 30 సంవత్సరాల నుండి మున్సిపల్ లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి నిరంతరం పనిచేసినవారనీ, వీళ్ళు అందరూ దళితులు, మధ్య తరగతికి చెందినవారనీ, వీళ్ళ అందరికీ పిఎఫ్, ఈఎస్ఐ కట్టు అవుతున్నదన్నారు. సుమారు నాలుగు కోట్ల రూపాయలు అప్పటి కౌన్సిల్ ఆధ్వర్యంలో పీఎఫ్ ఇఎస్ఐ కట్టవలసి ఉందన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్మికుల్లో పీఎఫ్ డబ్బులు జమ కాకపోవడం వలన కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి రావలసిన బెనిఫిట్స్ రావడం లేదు, దీనిపైన కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిజాంబాద్ పిఎఫ్ ఆఫీసులో క్లియరెన్స్ చేయించాలన్నారు. కార్మికుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవిధంగా వారు కార్మికులకు న్యాయం చేయాలనీ, గత కౌన్సిల్లో 11 మంది కార్మికులను తీసుకోవడం జరిగింది వారికి ఆరు నెలల జీతాలు ఇవ్వకుండా డ్యూటీ లో నుండి తీసివేసినారు. కార్మికులు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. వారికి జీతాలు ఇచ్చి తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలన్నారు. మున్సిపల్ కార్మికులు సి ఆర్ 271 ప్రకారం ఉన్నారన్నారు. కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ రెండు, మూడు రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తానని వీరిని తిరిగి డ్యూటీలోకి తీసుకునే విధంగా కార్యచరణ చేస్తానని పేర్కొన్నారు అన్నారు. కమిషనర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనీ, కార్మికులను డ్యూటీ లోకి తీసుకోకుండా మాట తప్పితే మున్సిపల్ కార్మికుల డ్యూటీ లోకి తీసుకునే దాకా పోరాటం చేయవలసి వస్తుందని, మెరుపు సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని దీనికి కమిషనర్ బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిఐటియు నాయకులు దీవెన, శివరాజవ్వ, బస ఇంద్ర, భోకె జ్యోతి, నడిపి నరసవ్వ, ఎల్లయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now