జమ్మికుంటలో మున్సబ్ మెజిస్ట్రేట్ కం జూనియర్ సివిల్ జడ్జి కోర్టును నెలకొల్పాలి

జమ్మికుంటలో మున్సబ్ మెజిస్ట్రేట్ కం జూనియర్ సివిల్ జడ్జి కోర్టును నెలకొల్పాలి

ఏకాభిప్రాయంతో తీర్మానం చేసిన న్యాయవాదులు

జమ్మికుంట ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం

ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల వర్తక సంఘ భవనంలో జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక మండలాలకు చెందిన న్యాయవాదులు సమావేశమై జమ్మికుంటలో మున్సబ్ మెజిస్ట్రేట్ కం జూనియర్ సివిల్ జడ్జి కోర్టును నెలకొల్పాలని ఏక అభిప్రాయంతో తీర్మానం చేశారు సమావేశంలో పాల్గొన్న 30 మంది న్యాయవాదులు ఉమ్మడిగా కోర్టును నెలకొల్పాలని నిర్ణయానికి వచ్చి సంబంధిత అధికారులపై ఒత్తిడి చేయాలని తీర్మానించారు జమ్మికుంట పట్టణ ,మండలం, వీణవంక, ఇల్లందకుంట మండలాలతో కలుపుకొని సివిల్ , క్రిమినల్ కేసులు దాదాపుగా 4000 విచారణలో ఉన్నాయని తెలిపినారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీనియర్ న్యాయవాది శేషాల సారంగపాణి అకాల మరణం గుర్తుచేసుకొని వారి ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వంగల పవన్ కుమార్, ఏబూసి లింగారెడ్డి, పొట్లపల్లి శ్రీధర్ బాబు, నక్క సత్యనారాయణ, కడార్ల సాంబమూర్తి, మొలుగూరి సదయ్య, నూతల శ్రీనివాస్, కనకం తిరుపతి, రావికంటి మధుబాబు, మొలుగూరి పద్మావతి, మ్యాదరి పద్మలత, జోష్ణ దేవి, సుకన్య, శ్రీరామ్ శిరీష, అబ్బరవేణి రాజు, వంశీకృష్ణ గూడెపు, యంగల లింగమూర్తి, అప్పని రాజు, పిట్టల రాజేష్, ముంజాల విజయ్, మోరే కళ్యాణ్, గుండ వరప్రసాద్, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment