ఆధారపు నిత్యానందంను సన్మానించిన మురళీధర్ గౌడ్
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 15, కామారెడ్డి :
విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన ఆధారపు నిత్యానందంను మురళీధర్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. 1979- 80 నుండి ఆర్ఎస్ఎస్ లో ఒక కార్యకర్తగా ఉండి, 1984 ఘట నాయక్ గా ఉండి సేవలు అందించారని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కుటుంబ ప్రబోధక్ గా సేవలు అందించిన నిత్యానందం విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టడం సంతోషంగా ఉందని మురళీధర్ గౌడ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిత్యానందాన్ని కలవడం సంతోషంగా ఉందన్నారు. వీరితో పాటు చింతల నీలకంఠం ముదిరాజ్, చింతల రమేష్, దువ్వల రమేష్, రాము, యాదగిరి తదితరులు ఉన్నారు.