అనుమానంతో హత్య అడ్డొచ్చిన వారిపై హత్యాయత్నం..

అనుమానంతో హత్య అడ్డొచ్చిన వారిపై హత్యాయత్నం..

నిజాంబాద్ జిల్లా ధర్పల్లి మండలం (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 3

కోటగిరి గంగాదాస్ తండ్రి పేరు: గంగాధర్, టైలర్,చిరునామా: ఎన్టీఆర్ కాలనీ, ధర్పల్లి గ్రామం మండలం,

ధర్పల్లి సి‌ఐ బిక్షపతి , నిందితుడి గురించి స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి నిందితుడి గురించి గాలింపు చర్యలు చేపట్టగ ఈరోజు తేది 03-09-2025 నాడు నిందితుడు కోటగిరి దాస్ పట్టుకొని పంచుల సమక్షంలో విచారించగా నిందితుడి కి 2008 లో కోటగిరి మణి అలియాస్ నాగమణితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు సంతానం కలదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి పలు మార్లు పెద్దల సమక్షంలో చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. చివరకు భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విడాకుల నోటరీపై సంతకం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత వేరుగా జీవనం ప్రారంభించాడు. నిందితుడు తన భార్యను దూరం చేయడానికి కారణం మచ్చ లక్ష్మి మరియు భోజేశ్వర్ (కిరాణా షాప్ యజమాని) అని అనుమానం పెంచుకున్నాడు. వారిని చంపాలని నిర్ణయించి దాదాపు ఒక నెల రోజుల పాటు అవకాశం కోసం ఎదురుచూశాడు. తేదీ 02-09-2025 ఉదయం సుమారు 08:00 గంటలకు, కత్తెర, కారం పొడి తీసుకొని లక్ష్మి ఇంటికి వెళ్లాడు.ఇంట్లో జనాలు లేరని గమనించి లోపలికి వెళ్లాడు.లక్ష్మిని కత్తెరతో పొడవబోతున్నప్పుడు ఆమె కూతురు గౌతమి అడ్డొచ్చి గాయపడింది.తర్వాత లక్ష్మిని తొడ, కాలి వద్ద పలు సార్లు పొడిచాడు.గౌతమి మళ్లీ అడ్డుకోవడంతో ఆమెను కూడా పొడిచాడు.అరుపులు విని పొరుగువారు నాగరాజు, శ్రీనివాస్, శోభ తదితరులు వచ్చి అడ్డుకోవడంతో వారిపైన కూడా కత్తెరతో దాడి చేశాడు.ఆ తర్వాత భోజేశ్వర్ షాపుకు వెళ్లి అతనిపై కారం చల్లీ కత్తెరతో దాడి చేసి. అతనికి భుజం, మనికట్టు, ఛాతి, మెడ వద్ద గాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించగ మచ్చ లక్ష్మి కత్తిపోటు గాయాలతో చనిపోయినధి. మిగతా వారు చికిత్స పొంధుతున్నారు.

బుధవారం రోజు ధర్పల్లి సీఐ మరియు సిబ్బంధి నిందితుడిని పట్టుకొని పంచుల సమక్షంలో 1. రక్తపు మరకలతో ఉన్న కత్తెర (FLEXON 10 – టైలర్ షాప్ కత్తెర) 2. రక్తపు మరకలతో ఉన్న షర్ట్ & ప్యాంట్, ఇవి అన్ని పంచుల సమక్షంలో స్వాధీనం చేసి, పంచులు సంతకాలు గల చీటీలు పెట్టి సీజ్ చేశారు.అనతరం నిందితున్నీ రిమాండ్ కోసం నిజామాబాద్ కోర్టులో హాజరుపరచడం జరిగింధీ.

Join WhatsApp

Join Now

Leave a Comment