భార్యపై అనుమానంతో భార్య మేనమామ పై హత్యయత్నం
రామగుండం // డిసెంబర్ 31//
-పట్టా పగలే అందరు చూస్తుండగా తల్వార్ తో విచక్షణ రహితంగా యువకుడిపై దాడి
-నేరస్తుడు పారిపోయేందుకు వాడిన ద్విచక్ర వాహనం స్వాధీనం పరుచుకున్న 1టౌన్ పోలీసులు
మంచిర్యాల జిల్లా భీమారం మండలానికి చెందిన గొల్ల శ్రవణ్ 28 సం ,లు శ్రవణ్ కు గత ఆరు సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వినోభానగర్ కు చెందిన కాళ్ళ పూజ అనే మహిళతో ప్రేమ వివాహం జరిగినది వీరికి ఇద్దరు పిల్లలు వీళ్ళ కాపురం కొన్ని సంవత్సరాలు బాగానే ఉంది గత సంవత్సరం నుండి శ్రవణ్ ఇతర అమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడానే విషయంలో భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుచున్నవి ఇట్టి గొడవ విషయంలో చాలా సార్లు పంచాయితీలు జరిగినాయి ఇట్టి విషయంలో వీరి మధ్య పూజ మేనమామ అయినా నంది శ్రీనివాస్ 38 సం, లు భార్య భర్తలకు గోడవ అయినా ప్రతి సారి భార్య భర్తలిద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఒప్పించి భర్త వద్దకు పంపించేవాడు అయినా శ్రవణ్ లో ఎలాంటి మార్పు రాలేదు శ్రవణ్ లో మార్పు రాదు అని తెలుసుకున్న పూజ గత నెల రోజుల క్రితం తన పుట్టినిల్లు అయినా గోదావరిఖని కి రావడం జరిగింది అదే విషయంలో పూజ మేనమామ అయినా నంది శ్రీనివాస్ మరియు పూజ కు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకుని ఎలాగైనా ఇతని అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం గురువారం ఉదయం గోదావరిఖని లోని నంది శ్రీనివాస్ వద్దకు వచ్చి మా భార్య భర్తల మధ్య గొడవ ఉంది కదా దాని గురించి మాట్లాడకుందాం అని శ్రీనివాస్ ను మాటల్లో పెట్టి అతన్ని గోదావరిఖని జూనియర్ కాలేజ్ వరకు తీసుకుని వచ్చి అతనితో మాట్లాడుతూ తనతో తెచ్చుకున్న కత్తి తో విచక్షణ రహితంగా శ్రీనివాస్ పై ఎక్కడ పడితే అక్కడ పొడవడం జరిగింది వెంటనే అక్కడి స్థానికులు స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా పోలీస్ వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రాణపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్ ను అత్యవసర చికిత్స కొరకు ఆసుపత్రికి పంపించడం జరిగింది శ్రీనివాస్ సోదరుడు నంది నగేష్ ఫిర్యాదు మేరకు శ్రవణ్ మరియు తన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి నేరస్థుని కోసం ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందలను ఏర్పాటు చేయగా అతనికి కోసం సిఐ ఇంద్రసేణారెడ్డి, ఎస్సైలు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందం బీమారం వైపు పారిపోతున్న నేరస్తున్ని గంగనగర్ వద్ద పట్టుకొని కోర్టులో హాజరు పరచి రిమండ్ కు తరలించడం జరిగింది నేరస్తుడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ఆరోపణలతో భార్యపై అనుమానం తో ఈ అఘాయిత్యానికి పాల్పడీనాడని తెలుపడం జరిగిందని ఏసీపీ రమేష్ తెలిపారు.