అక్రమ సంబంధానికి అడ్డుగా భర్త హత్య… హార్ట్ స్ట్రోక్ నాటకం – ఆరుగురు అరెస్ట్

అక్రమ సంబంధానికి అడ్డుగా భర్త హత్య… హార్ట్ స్ట్రోక్ నాటకం – ఆరుగురు అరెస్ట్

నిజామాబాద్ (ప్రశ్నా ఆయుధం)
జనవరి 4:మాక్లూర్ మండలం బోర్గం (కె) గ్రామానికి చెందిన పల్లటి రమేష్ (35) హత్య కేసు సంచలనంగా మారింది. అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు భార్య పల్లటి సౌమ్య తన ప్రియుడు దిలీప్‌తో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

భోజనం అనంతరం మంచి నీటిలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి, నిద్రలోకి వెళ్లిన రమేష్‌ను ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం హార్ట్ స్ట్రోక్‌గా చిత్రీకరించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

విదేశాల్లో ఉన్న మృతుడి సోదరుడికి అనుమానం రావడంతో రీపోస్టుమార్టం చేయగా హత్యగా నిర్ధారణ అయింది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడు దిలీప్, అతని తమ్ముడు అభిషేక్ సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment