తల్లి కొడుకుల హత్య దారుణం
*సమాజంలో హింసకు తావు లేదు*
అంతక్రియల ఖర్చు నిమిత్తం బాధిత కుటుంబానికి 20వేల ఆర్థిక సహాయం
-బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్:
తల్లి కొడుకుల హత్య దారుణమని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి వీరభద్ర నగర్ కాలనీలో చోటుచేసుకున్న తల్లి కొడుకుల హత్యపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మనిషిని మరో మనిషి ప్రాణం తీస్తూ హత్య చేయడం దారుణమని అన్నారు. మండలంలో మునుపెన్నడు చోటుచేసుకుని విధంగా తల్లి కొడుకుల హత్య తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. సమాజంలో హింసలకు తావు లేదని అన్నారు. మరోసారి ఇలాంటి అమానుష ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. అంతక్రియల ఖర్చు నిమిత్తం 20000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యురాలు జ్యోతి కి అందజేశారు.