Headlines in Telugu
-
మూసీ ప్రక్షాళనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై వేముల వీరేశం ఆగ్రహం
-
“మూసీ నీటితోనే ముఖం కడుక్కోండి” – ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
నల్గొండ ప్రజల పోరాటానికి బీజేపీ వ్యతిరేకంగా జైత్రయాత్ర
-
డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలను ఎందుకు పట్టించుకోరు? – వేముల ప్రశ్న
-
“మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే, ప్రజల తిరుగుబాటు ప్రారంభం”
నల్గొండ జిల్లా..
*ఎమ్మెల్యే వేముల వీరేశం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్ర పై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాట్ కామెంట్స్..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ప్రకటించిన వెంటనే మూసి పరివాహక ప్రాంత ప్రజలు మరియు రంగారెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ఊపిరి పీల్చుకున్నారు..మాకు మంచి నీళ్లు వస్తాయని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు..మూసి ప్రక్షాళన చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు..తప్పితే మరొకటి కాదు…బిజెపి ఇతర రాష్ట్రాలలో నదుల ప్రక్షాళన చేయట్లేదా… అక్కడ ఇండ్లు కూల్చడం లేదా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి..బీజేపీ చేసేది మూసీ నిద్ర కాదు తీర్థయాత్రలు చేస్తున్నట్టు ఉంది…మూసి ప్రక్కనే పడుకోకుండా ఎక్కడో నిద్రచేసి మూసీ నిద్ర అంటున్నారు..మూసీ నిద్ర చేసిన వాళ్ళు మూసి నీళ్లతోనే ముఖం కడుక్కోవాలి ఆ నీళ్లతోనే స్నానం చేయాలి..మూసి ప్రక్షాళన డిపిఆర్ తయారు కాకుండానే అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు..మూసీ ప్రక్షాళన చేయడం మూలంగా మీకు వచ్చిన నష్టం ఎంటో చెప్పాలి..ఈటల రాజేందర్ కూడా ద్వంద వైఖరిగా మాట్లాడుతున్నాడు..మూసి పరిసర ప్రాంత ప్రజలు ఎటువంటి దొంగ మాటలను పట్టించుకోవద్దు..డబ్ల్యూహెచ్వో చెప్పిన మాటలను హెచ్చరికలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదు..నల్గొండ జిల్లా ప్రజల బాగోగులు బిజెపికి అవసరం లేదు..మూసి ప్రక్షాళన అడ్డుకుంటే ఎవ్వరు కూడా నల్లగొండ జిల్లాలో తిరగలేరు ప్రజల తిరుగుబాటు మొదలైతది జైత్రయాత్ర చేస్తారు..మూసి ప్రక్షాళన చేయాలంటే గైడ్ వాల్ తో మూసి పరివాహక బఫర్ జోన్లో ఉన్న ప్రజలను కూడా తరలించాల్సిన అవసం ఉంది..మూసి మురికి కూపంలో ఉన్న ప్రజలను సురక్షితమైన చోటుకు తరలించే ఆలోచన ఉంది..కానీ టిఆర్ఎస్ బిజెపి పార్టీ నాయకులు రాజకీయం కోసం డ్రామాలు ఆడుతున్నారు..బిజెపి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి బీ టీం లాగా పనిచేస్తుంది..ఒకనాడు మూసి నది నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి.. మళ్లీ అలాంటి రోజులు రావాలని ప్రభుత్వం పనిచేస్తుంది..డబ్ల్యూహెచ్ఓ మూసి నీళ్లలో సూపర్ బగ్ బ్యాక్టీరియా ఉందని ప్రకటించింది..నలగొండ జిల్లా ప్రజల కష్టాలు మీ పార్టీలకు అవసరం లేనప్పుడు మా ప్రాంత ప్రజలకు కూడా మీ పార్టీలతో అవసరం లేదు..మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నల్గొండ ప్రాంతం నుండి పోరాటం మొదలవుతుంది..