*కొత్త పార్టీపై మస్క్ పోల్.. YES అన్న 80% మంది*
USలో ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘అమెరికాలో కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందా?’ అని మస్క్ జూన్ 5న Xలో పోల్ పెట్టారు. ఇందులో 56 లక్షల మంది పాల్గొనగా 80% మంది YES అని ఓటు వేశారు. దీనిపై మస్క్ మరో ట్వీట్ చేస్తూ ‘ది అమెరికా పార్టీ’ అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించిన మస్క్ ఆయనకు దూరమయ్యారు. తాను లేకుంటే ట్రంప్ గెలిచేవారు కాదని వ్యాఖ్యా నించారు.