కుటుంబ పోషణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్
(ప్రశ్న ఆయుధం) జులై 12
జాతీయ కుటుంబ పోషణ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బిక్కనూర్ తాసిల్దార్ సునీత కోరారు. బడుగు వర్గాల ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారిబాధితులకు 20.000 వేలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.