సూర్యాపేట జిల్లా కోదాడలో ఆగస్టు మూడో తేదీన ముత్యాలమ్మ(బోనాల)పండుగ…..
కోదాడ పట్టణంలో ఆగస్టు 3వ తేదీ న ముత్యాలమ్మ (బోనాలు) పండుగ నిర్వహిస్తున్నట్లు ముత్యాలమ్మ కమిటీ, రైతు కమిటీ పట్టణ పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆదివారం పట్టణంలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో ముత్యాలమ్మ కమిటీ, రైతు కమిటీ, పట్టణ పెద్దలు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రతీయేట శ్రావణమాసం రెండవ ఆదివారం ముత్యాలమ్మ పండుగ నిర్వహించే విధంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు. పట్టణ ప్రజలు బోనాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకోవాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.