ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నా వంతు సహకారం: సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జీవన జ్యోతిర్లింగం ఆలయానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి లక్షా50వేల రూపాయలను విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భక్తుల మనశాంతికి దోహదపడతాయని అన్నారు. ఇలాంటి పవిత్రమైన ఆలయ నిర్మాణానికి సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. శివుని కృపతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మంద రమేష్, రాజు గౌడ్, నీలం రాము, బుక్క శ్రీకాంత్, ఫణి,ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment