నా.. మనసులోని మాట..

నా.. మనసులోని మాట..’_

నా హృదయాంతరాలలో.. కదలాడే నా ఆత్మఘోష…

IMG 20241016 WA0119

*_దయచేసి అన్యధా భావించకండి.మంచి మనసుతో అర్థం చేసుకోండి.

 

*_ఏంటో ఈ మాయ..నా బాధ కంటే ఎదుటివారి బాధనే నన్ను కలిచి వేస్తుంది…_*

 

*_నా మనో మందిరంలో బాధగా తిష్ట వేస్తుంది. అది నన్ను ప్రశాంతంగా నిదుర పట్టనివ్వట్లేదు.. ఇది నా మానసిక దౌర్భాగ్యం కాబోలు._*

 

*_నా మనో మందిరములో జనిస్తున్న ప్రశ్నలు ఎన్నో.. ఏమి చేయని పరిస్థితిలో నా భావాన్ని, నా ఆవేదనను మీతో పంచుకుంటున్నాను._*

 

*_ఏదో చేయాలని తపన కాని, ఏమి చేయలేకపోతున్నా.._*

 

*_ఎదుటి వ్యక్తుల కన్నీళ్లు తుడవాలని ఉంది.. కానీ తుడవలేకపోతున్నా.._*

 

*_ఎదుట వ్యక్తుల పరిస్థితులను చూసి నా హృదయం ద్రవిస్తుంది . కానీ ఏమి చేయలేక నిస్సాయ స్థితిలో ఏమి చేయలేకపోతున్నా.._*

 

*_కండ్ల ముందే, అన్నీసర్వం కోల్పోయి అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులను చూసి చలించిపోతున్న.. కానీ ఏమి చేయలేకపోతున్నా ._*

 

*_జానెడు కడుపు కోసం తహతహలాడుతున్న అభాగ్యులేందరో.. కడుపునిండ కూడుకు నోచుకోని కటిక పేద వాలెందరో.._*

 

*_అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడా.. ఎందుకు ఈ పరీక్ష ఎందుకు ఈ శిక్ష…_*

 

*_కడుపునిండా తిన్నది అరగక ఔషధాలతో కాలం గడుపుతున్న భాగ్యవంతులు ఎందరో.. కాలే కడుపుకు తిండి దొరకక అలమటిస్తున్న దౌర్భాగ్యులు ఎందరో…_*

 

*_దైవం మనుష్య రూపేనా అంటారు కదా! ప్రతి మనిషిలో దైవాన్ని చూసే గుణాన్ని అలవర్చుకోవాలి. అదే ధర్మం, అదే మానవత్వం.._*

 

*_మమై వంశో జీవ లోకే జీవో భూతాస్తనా తన’ జీవుడు నా వంశము భగవంతుడు యొక్క మాట. అలాంటి జీవునికి సేవ చేసే భాగ్యము ఎంతటి అదృష్టం కదా!ఒక్కసారి ఆలోచించండి.._*

 

*_కళ్ళ ముందు జరుగుతున్న దశ్చర్యాలను చూసి ఏమి చేయని దుస్థితి నిస్సహాయ స్థితి.. ఏంటో ఈ జీవితం. ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది._*

 

*_అందుకే ఈ నా బాధ ఇదే నా వెధ.. నా ఆవేదన.. ఎవరైనా ధర్మాత్ములు, పుణ్యాత్ములు , దాతలు నాతో పాలుపంచుకుంటారా! నిరుపేదలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిస్తారా!_*

 

*_అలాంటి ధర్మాత్ములకై వేచి చూస్తున్న.. ఏదోరకంగా వారికి నా మాటగా సహాయ, సహకారాలు అందుతుందేమోనని ఉబలాట పడుతున్న.._*

 

*_ఈ కలియుగంలో కూడా అలాంటి వారు ఉన్నారనేది నా.. విశ్వాసం… నా విశ్వాసాన్ని..ఆశ్వాసం, స్వాంతనం కలిగించే దాతలకై వేచి చూస్తున్నా.. నాతో చేయి చేయి కలిపే వారు ఎందరో.. వారి కొరకే ఈ పోస్టును గ్రూప్లో పోస్ట్ చేస్తున్న.._*

 

*_దయచేసి అలాంటివారు నాకు వ్యక్తిగతంగా మీ భావాలను పంచుకుంటారని, ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను.._*

 

*_నా ఈ చిన్న, ఈ చిరు ప్రయత్నంలో మీరందరూ తోడు,నీడగా ఉంటారని ఆశిస్తూ…ఆకాంక్షిస్తూ…_*

Join WhatsApp

Join Now