*ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం*
*నా ఫోన్,నా భర్త ఫోన్,నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారు*
*ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు*
*అనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు*
*ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా*
*బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న… ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం*
*రేవంత్,చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి*
*అనాడు జగన్,కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది*
*తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్*
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
– నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరి వాళ్ళ ఫోన్లు లు ట్యాప్ చేశారు
– ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనేది ముమ్మాటికి పచ్చి నిజం
– ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేది
– ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవాళ్ళు
– వీళ్ల సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయింది
– ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్
– నా ఫోన్ ట్యాప్ అయినట్లు నాకు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి చెప్పారు
– వైవీ సుబ్బారెడ్డి ఆనాడే నిర్ధారించారు
– అప్పుడు వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చారు
– నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు చెప్పారు
– ట్యాప్ చేసిన ఒక ఆడియో నాకు స్వయంగా వినిపించారు
– ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా..అంటే అనుమానమే ?
– జగన్ తన సొంత మేనల్లుడు,మేన కోడలు అస్థి కాజేసే అంశంలో సుబ్బారెడ్డి తో అబద్ధాలు చెప్పించాడు
– ఇలాంటి పరిస్థితిలో వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడు అనుకోను
– ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తా
– ఏ విచారణను అయినా ఎదుర్కొంట
– బైబిల్ మీద ప్రమాణం చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నేను చెప్పగలను
– ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిస్తే మీరు ఏం చేశారు అని నన్ను అడగొచ్చు
– ఇది అక్రమం,అనైతికం కదా అని నన్ను అడగొచ్చు
– స్వయంగా మీ ఇంట్లో మీరు వింటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగొచ్చు
– అన్నాడు ఉన్న పరిస్థితులు వేరు
– అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు
– వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది
– నేను జగన్ కి తోడబుట్టిన చెల్లెలు
– ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర
– నా భవిష్యత్ ను పాతిపెట్టాలని ఎన్నో చేశారు
– ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కుట్ర
– నాకు సపోర్ట్ చేసిన వాళ్లను బెదిరించారు
– రాజకీయంగా నా వాళ్ళు రానివ్వకుండా చేశారు
– నా అనుచరులను భయబ్రాంతులకు గురి చేశారు
– నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు
– నేను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కి ఏ సంబంధం లేదు
– కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశాడు
– నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశాడు
– నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశా
– నా ప్రతి పోరాటానికి అడ్డు పడ్డారు
– ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం
– ముమ్మాటికి నిజం
– అనాడు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవు
– ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు అధికారంలో ఉన్నారు..అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు
– ఫోన్ ట్యాపింగ్ మీద చర్యలు తీసుకోవాలి
– ఎక్కడకు పిలిస్తే అక్కడకు వస్తా
– నేను కేసు పెట్టాలి అనుకుంటే అప్పుడే పెట్టే దాన్ని
– నాకు పర్సనల్ గజ్ అంటూ ఏమి లేదు
– నా మీద జగన్ కేసు వేసినప్పుడే నేను కేసు వేసే దాన్ని
– అమ్మకు ఇచ్చిన ఆస్తి విషయంలో కేసు వేసినప్పుడే నేను కేసు వేసే దాన్ని
– రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలి.