- మైనంపల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని గజ్వేల్ లో మైనంపల్లి క్రికెట్ టోర్నమెంట్
- క్రికెటర్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సర్పంచ్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ చిట్కుల్ మహిపాల్ రెడ్డి
గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, జనవరి 11, (ప్రశ్న ఆయుధం ) : గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఐఓసి దగ్గర్లో గల మైదానంలో మైనంపల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని మైనంపల్లి టోర్నమెంట్ను శనివారం సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చిట్కుల్ మహిపాల్ రెడ్డి బ్యాటింగ్ చేసి టోర్నీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బయ్యారం మల్లారెడ్డి, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజిరెడ్డి, మనోహరాబాద్ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, పీసీసీ మైనార్టీ కార్యదర్శి ఇక్బాల్, గజ్వేల్ టౌన్ సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ బాబా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ, సిద్దిపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి, మన్నే కృపానందం, గజ్వేల్ నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్ కొత్తపేట కరుణాకర్ రెడ్డి, సమీర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, జగదేపూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ గుప్తా, గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయిని తిరుపతి, నాయిని వెంకటేష్, గజ్వేల్ మైనార్టీ నాయకులు జానీ, క్యాసారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కప్ప భాస్కర్, కొండల్ రెడ్డి, ప్రేమ్ కుమార్, జాలిగామ మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు గౌడ్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు దిలాల్పూర్ ప్రశాంత్ రెడ్డి, భూషణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు రాజు, కన్న యాదవ్, నరసింహులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.