సహస్ర మర్డర్ కేసులో వీడిన మిస్టరీ…
ప్రశ్న ఆయుధం ఆగస్టు 22: కూకట్‌పల్లి ప్రతినిధి
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని బాలిక హత్యకేసులో మిస్టరీ వీడింది. సాయి అనే టీనేజర్ పనిగా తేల్చారు పోలీసులు. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు సదరు టీనేజర్. వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80వేలు దొంగతనం చేశాడు. డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కూర్చుని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు. దొంగతనం ఎలా చెయ్యాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా సదరు టీనేజర్ ఓ ప్లాన్ రాసిపెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
సాయి బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయిని అక్కడ సంచరించినట్లు స్థానికులు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్టరీని చేధించారు. స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును చేధించిన పోలీసులు. పోలీసుల విచారణలో తొలుత సాయి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. క్రికెట్ ఆడేందుకు
సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్టు పోలీసులను మాయ చేయాలని చూశాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు.