N నేలమట్టం.. గండిపేట టీడీపీ ట్రస్ట్ కథేంటి రేవంత్ రెడ్డి….
కట్టినది కూల్చేశారు సరే.. టీడీపీ ట్రస్ట్ కథేంటి..? ఎప్పుడు కూలుస్తున్నారు..? హైడ్రా ఎప్పుడు రంగంలోకి దిగుతోంది..? అనేదానిపై కాస్త సెలవిస్తే మంచిది సీఎం సార్ అంటూ నెటిజన్లు, సామాన్య ప్రజలు కోరుతున్నారు. ప్రజా పాలనలో అక్రమ కట్టడాలను అడ్డంగా తొలగిస్తున్నారు సరే.. ఇది అన్నిటికీ వర్తించాలి కదా..? అనే డిమాండ్ వస్తోంది..
రేవంత్ ఏం చేయబోతున్నారో చూడాలి మరి.
బీఆర్ఎస్ ఇలా..!
ఇది హైడ్రా కాదు.. రేవంత్ రాజకీయ హైడ్రామా అంటూ బీఆర్ఎస్ తిట్టి పోస్తోంది. రేవంత్ పెట్టిన హైడ్రా అసలు ఉద్దేశం అక్రమ కట్టడాల తొలగింపు కాదని.. కేవలం రాజకీయ ప్రత్యర్ధుల మీద కక్ష సాధింపు అని గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరించి వసూళ్ళు చేయడం కోసమే అని నెల రోజుల దాని పనితీరు చూసిన వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారనపి బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. హైడ్రా.. అంతా మా ఇష్టం అన్నట్టు సర్కారు వ్యవహారం అని.. హైడ్రా పరిధి, కూల్చివేతలపై ఎన్నెన్నో సందేహాలు వస్తున్నాయని.. కొన్నింటిని వదిలి, కొన్నింటినే కొట్టి.. ఇదీ హైడ్రా పని విమర్శలూ వస్తున్నాయి. తన పరిధిలో లేని మూడు గ్రామాల్లోనూ కూల్చుడు ఇదేనా హైడ్రా పని అంటూ బీఆర్ఎస్‌కు చెందిన మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయ్..!