పెళ్లి వివరాలు త్వరలో వెల్లడిస్తా: నాగచైతన్య
నటి శోభితతో తన పెళ్లి ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనేది త్వరలోనే వెల్లడిస్తానని నాగచైతన్య తెలిపారు. తనకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య, సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ఇష్టమన్నారు. HYDలో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. N-కన్వెన్షన్ కూల్చివేత గురించి అడగగా, దానిపై తన నాన్న నాగార్జున ట్వీట్ చేశారని, తర్వాత మాట్లాడతానన్నారు. నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ను హైడ్రా కూల్చిన సంగతి తెలిసిందే.