కార్పొరేషన్ చైర్మన్‌గా నాగబాబు.. త్వరలోనే నియామకం!

*కార్పొరేషన్ చైర్మన్‌గా నాగబాబు.. త్వరలోనే నియామకం!*

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కీలక పదవి దక్కబోతున్నట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ కోరిక మేరకు నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలని తొలుత నిర్ణయించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఒక స్థానాన్ని కూడా కేటాయించారు. అయితే, నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయనను కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తారని సమాచారం. అందులో భాగంగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ పర్యావరణానికి దోహదం చేసే బాధ్యతలు కలిగిన కార్పొరేషన్‌కు ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now