ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన,
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,
నాగర్ కర్నూల్ మండలం ఎండబెట్ల గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం సందర్శించారు.రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
వరి ధాన్యం సన్న రకమా, దొడ్డు రాకమా అని గుర్తించే యంత్రంతో చేసే విధానాన్ని పరిశీలించారు. తేమశాతం పరిశీలించిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించేలా యేర్పాటు చేయాలని అధికారులనుఆదేశించారు.
మిల్లర్ల వద్ద ఏమైనా ఇబ్బందులుఎదురవుతున్నాయా రైతులను అడిగి ఆరా తీశారు.ఎక్కడ కూడా తరుగు, తాలు పేరిట కోతలు విధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగుల కొరత నెలకొనకుండా చూడాలని, నిర్దేశిత మిల్లులకు వెంట వెంటనే ధాన్యం తరలింపు కోసం లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో టాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సన్నాలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2320 తో పాటు బోనస్ రూపేణా ప్రభుత్వం రూ.500 చొప్పున చెల్లించనుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మద్దతు ధర బ్యాంకు ఖాతాలలో జమ అయిన అనంతరం బోనస్ డబ్బులు కూడా జమ అవుతాయని కలెక్టర్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిప్యూటీ తాసిల్దార్ రాఘవేందర్ రెడ్డి ప్యాక్స్ సీఈవో శ్రీనివాసులు రైతులు తదితరులు ఉన్నారు.