సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో ఉన్న పీఎన్ఆర్ టౌన్ షిప్ కాలనీలో అసోసియేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మన్నె లక్ష్మి మద్దతుతో నాగరాజు విజయం సాధించారు. ఈ సందర్భంగా మన్నె లక్ష్మి మాట్లాడుతూ.. కాలనీ వాసుల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేసే నాయకుడిగా నాగరాజు నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పీఎన్ఆర్ టౌన్ షిప్ అభివృద్ధికి అందరూ కలిసి పని చేయాలని ఆమె సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులకు పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఇంద్రేశం పీఎన్ఆర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో నాగరాజు విజయం

Oplus_0