*నాగారం మూడవ వార్డులో కొనసాగుతున్న అక్రమ నిర్మాణం*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం మే 19
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి మూడవ వార్డు ప్రధాన రహదారి పక్కన అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ షెడ్డు నిర్మాణంపై స్థానికుల ఆందోళన కొనసాగుతోంది. మున్సిపల్ సిబ్బంది ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారికి ఆనుకుని జరుగుతున్న ఈ నిర్మాణం గురించి మున్సిపల్ అధికారులకు సమాచారం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఒకవేళ తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.