ఎన్ హెచ్ ఆర్ సి భద్రాచలం టౌన్ ప్రెసిడెంట్ గా ఇమంది నాగేశ్వరరావు

నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

నియామక పత్రాలు భద్రాచలం టౌన్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మారిల్లి విజయకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి చాప భాను ప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని పలువురికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నేషనల్ హుమన్ రైట్స్ కమిషన్ (NHRC) భద్రాచలం టౌన్ ప్రెసిడెంట్ గా ఇమంది నాగేశ్వరరావు ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా నూతన భద్రాచలం టౌన్ ప్రెసిడెంట్ ఇమంది నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం నిజాయితీగా నిస్వార్ధంగా సేవ చేస్తానని అన్నారు.

Join WhatsApp

Join Now