Site icon PRASHNA AYUDHAM

పదవి విరమణ పొందిన నాగిరెడ్డిపేట ఎస్సైకి ఘనంగా వీడ్కోలు

IMG 20250630 WA0363

పదవి విరమణ పొందిన నాగిరెడ్డిపేట ఎస్సైకి ఘనంగా వీడ్కోలు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 30

 

 

• శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడపాలి.

• ఉద్యోగి జీవితంలో పదవి విరమణ అనేది సహజం..

• కామారెడ్డి జిల్లాలో 18 నెలలుగా విధులు నిర్వహిస్తూ, సోమవారం రోజున పదవీ విరమణ పొందిన నాగిరెడ్డిపేట ఎస్సై పి. మల్లారెడ్డి, కు ఘనంగా వీడ్కోలు తెలిపారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల ప్రకారం, కామారెడ్డి జిల్లా నుండి పదవీ విరమణ పొందుతున్న నాగిరెడ్డిపేట ఎస్సై పి. మల్లారెడ్డి,కి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి, శ్రీ మల్లారెడ్డిని పూలమాల, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. 1985లో పోలీసు కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరిన మల్లారెడ్డి, దాదాపు 40 సంవత్సరాలపాటు పోలీసు శాఖకు కట్టుబాటు, నిబద్ధతతో సేవలందించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ… పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఆరోగ్యంగా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటుకు చేసిన సేవలు ఎంతో ఘననీయమని, పదవి విరమణ అనంతరము కూడా పోలీస్ శాఖ సహాయంగా ఉంటుందని తెలిపారు. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు భాగుండాలని ఆకాంక్షించారు.

ఈ వీడ్కోలు కార్యక్రమంలో డీసీఆర్బీ, సీఐ శ్రీ మురళి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నవీన్ కుమార్, శ్రీ యన్. కృష్ణ తదితరులు, పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

Exit mobile version