నాగోబా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

*నాగోబా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు*

ఆదిలాబాద్‌ జిల్లా:జనవరి 27

ఆదిమా గిరిజనుల ప్రాచీన సంస్కృతి సాంప్రదాయా లకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర ఉత్సవాలకు సూచకంగా నిర్వహించే మహా పూజను పురస్కరించుకొని,దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.

జనవరి 28 అనగా రేపటి నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు 8 రోజులపాటు అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్, లో నిర్వహించే ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టిందని,మంత్రి సురేఖ అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ లో కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఉత్సవాలను ప్రభుత్వ పండుగగా గుర్తించింది. ఆదివారం జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ అలం, ఉట్నూర్ ఏఎస్పి కాజల్ నాగోబా ఆలయాన్ని దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చే భక్తుల కోసం ఘనంగా ఏర్పాట్లు ఉండా లని, లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వ యం చేయాలని సూచించారు.

*రేపటినుండి జాతర షురూ..*

నాగోబా జాతర ఉత్సవాలను ఆదివాసీలు సంప్ర‌దాయ‌, ఆచార వ్యవ హారాలతో నిర్వహించను న్నారు. ఇప్పటికే పవిత్ర గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొని వచ్చిన మెస్రం వంశస్థులు శనివారం కేస్లాపూర్ కు చేరుకోనున్నారు.

28వ తేదీన రాత్రి ప‌ది గంటలకు మహా పూజ తో జాతర ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఆదివాసీలు తీసుకువచ్చిన పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించ నున్నారు.

ఈ జాతర ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్ గ‌ఢ్‌ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు.

Join WhatsApp

Join Now