నాగుల పంచమి వేడుకలు..
పుట్టల వద్దకు పోటెత్తిన భక్తులు
శ్రీ సంతన నాగశివ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ప్రత్యేక పూజలు
జమ్మికుంట ఇల్లందకుంట జులై 29 ప్రశ్న ఆయుధం
నాగుల పంచమిని పురస్కరించుకుని భక్తులు పుట్టల వద్దకు బారులు తీరారు కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో శ్రీ సంతాన నాగశివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మురళి శర్మ మాట్లాడుతూ సర్ప దోషం ఉన్నవారు నాగుల పంచమి రోజున నాగదేవతల పూజ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని ఈ ఆలయంలో ప్రత్యేకంగా పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు సంతానం లేని వారికి సంతానం జరుగుతుందని భక్తుల నమ్మక మని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి మట్టికే రమేష్. అర్చకులు కురవి మురళి శర్మ. ఆలయ పూజారి లింగంపల్లి రాజేశ్వరరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.