నాగుల పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. నాగదేవతకు పూజలు నిర్వహించి పుట్టల వద్ద పాలు, ఫలహారాలతో నైవేద్యం సమర్పించారు. మందిరాల నుంచి ఇంటికి వచ్చాక అన్నదమ్ములకు కండ్లు కడిగి, హారతి ఇచ్చారు. పుట్టింటికి వచ్చిన ఆడపడుచులు పండుగ సంబరాలు చేసుకున్నారు..