మెదక్ జిల్లా యూత్ ఫెస్టివల్ పోటీలలో నాగులపల్లి యువకులకు ప్రథమ స్థానం

అవార్డు అందజేసిన మెదక్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు

మెదక్/నర్సాపూర్, సెప్టెంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా యూత్ ఫెస్టివల్ పోటీలలో, సైన్స్ మేళా అంశంలో శనివారం నాగులపల్లి గ్రామ శివాజీ యూత్ సభ్యుడు, నాగుల పల్లి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సలిగంజి నరేందర్, చండూరి మురళి కృష్ణ లకు ప్రథమ స్థానం పొంది మెదక్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ ఆఫీసర్ దామోదర్, సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ ప్రాజెక్టు రూపొందించడంలో యువకులకు సహకరించి, ప్రోత్సహించిన నాగులాపల్లి ఉన్నత పాఠశాల బయో సైన్స్ ఉపాధ్యాయులు ప్రసన్న కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ప్రతిభ కనబర్చి, గ్రామానికి, పాఠశాలకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now