ప్రజా నాయకునిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న నక్కా

రికార్డు విజయాలతో ప్రజా నాయకునిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న నక్కా ఆనందబాబు 

అంబేడ్కరిజం పుస్తకం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్..

IMG 20240910 WA0051

మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారి పుట్టినరోజు సందర్భంగా టిడిపి రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్,ఓబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు తిరువీధుల శంకర్ ప్రసాద్ పలువురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలు కలిసి కొర్రపాటి సురేష్ నక్కా ఆనందబాబు గారికి అంకితం ఇచ్చిన రచన గావించిన అంబేడ్కరిజం పాటల పుస్తకం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవరచుకుని తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షునిగా వేమూరు నియోజకవర్గానికి 3 సార్లు రికార్డు స్థాయిలో శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర కేబినెట్‌లో సాంఘిక శాఖా మంత్రిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసి రాష్ట్ర ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని పొంది పదవులకే వన్నె తెచ్చిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు మాజీ మంత్రి వర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు నేటి యువతకు ఆదర్శనీయులని తెలిపారు

ఓబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే కాక అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేసే అందరివాడు ఆనందబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నత పదవులు అధిరోహించాలని మరెంతో మంది పేద ప్రజలకు తోడ్పాటునందించాలని తెలిపారు ఆనందబాబు గారికి అంకితం ఇచ్చిన అంబేడ్కరిజం మొదటి ఆల్బమ్ రాబోయే అంబేడ్కర్ జయంతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  చేతుల మీదుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అట్టహాసంగా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర యానాది హక్కుల పోరాట సమితి అధ్యక్షులు తిరువీధుల శంకర్ ప్రసాద్, మాలమహానాడు నాయకులు భట్టు మనోజ్,కిరణ్,చిన్నా, మల్లిఖార్జునరావు, చంద్రశేఖర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now