బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ..చరిత్ర మరిచిన వీరులను, చరిత్రకారులు వెతకని సాక్షాలను బయటికి తీస్తూ.. వీర తెలంగాణ నిజమైన పోరు బిడ్డ17 సంవత్సరాల వయసులోనే బందుకు అందుకొని పేద ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు, చాకలి ఐలమ్మ ,దొడ్డి కొమురయ్య లకు గురువుల నిలిచి ఉద్యమ పాఠాలు నేర్పిన వీరుడు నల్ల నరసింహులు – వజ్రవ్వల విరోచిత పోరాటానికి స్ఫూర్తిగా కడివండి గ్రామంలో నల్ల నరసింహులు వజ్రవ్వ విగ్రహాలను నెలకొల్పాలని బిసి ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు.బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్ తో కలిసి నల్ల నరసింహులు స్వగ్రామం కడివండి గ్రామాన్ని సందర్శించారు. ఈసందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ.
. ప్రాంతంలో దొరలు,దేశ్ ముఖులు,పెట్టుబడుదారుల చేతిలో ప్రజలు నలిగిపోతున్న వేళ ఆరు కాలం కష్టపడి పంట చేతికి వచ్చినాక దొరలు పొలాలపై దండెత్తి వచ్చి పంటలను ఎత్తుకుపోతున్న పరిస్థితులు,ప్రజలకు ఏ మాత్రం స్వేచ్ఛ లేకుండా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితులు, మహిళలను బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చిన దుర్భాగ్యమైనటువంటి పరిస్థితులు,పేద ప్రజలకు గొంతు లేకుండా దొర నీ బాంచనని బతికే బాంచన్ బతుకులు అన్ని ఇన్ని కాదు ఎన్నో దౌర్జన్యాలతో నలిగిపోతున్న తెలంగాణ గడ్డమీద ఒక వీరుడు పుట్టాడు. నల్గొండ జిల్లా,దేవరప్పుల మండలం,కడివండి గ్రామంలో నల్ల నరసింహులుగా ఉదయించాడు,17 ఏళ్ల వయసులోనే ప్రజలపై జరుగుతున్న దాకృష్టాలకు ఎదురు తిరిగి బంధుకు పట్టి, సంఘాలు కట్టి ప్రజా పోరులో నిలిచాడు.ఓ నాయకుడు ఆయనే నల్ల నరసింహులు అని జీవితాంతం పేద ప్రజల కోసం పోరాటం చేసిన మహా నాయకుడు నల్లా నరసింహులు స్వగ్రామాన్ని సందర్శించడం తమ అదృష్టమని అన్నారు.వీర తెలంగాణ నిజమైన పోరు బిడ్డ నల్ల నరసింహులుస్వగ్రామంలో వారి విగ్రహం లేకపోవడం నేటి పాలకులకు ఉద్యమకారులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కడివండి గ్రామంలో నల్ల నరసింహులు వజ్రవ్వల విగ్రహాలను నెలకొల్పి వారి ఉద్యమ స్ఫూర్తిని నిలబెడతామని,పేద ప్రజల కోసం వారు చేసిన త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించే విధంగా చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే నల్ల నరసింహులు – వజ్రవ్వ గార్ల విగ్రహాలను ట్యాంకు బండుపై నెలకొల్పాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజా పోరాటా నిర్వహిస్తామని తెలిపారు.
To provide the best experiences, we use technologies like cookies to store and/or access device information. Consenting to these technologies will allow us to process data such as browsing behavior or unique IDs on this site. Not consenting or withdrawing consent, may adversely affect certain features and functions.