నానక్ రామ్ గూడ 400 ఏండ్ల చరిత్ర ఉన్న కాళికామాత దేవాలయానికి హైడ్రాధికారులు నోటీసులు
నారగ్రామ్ గూడ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి భక్తిశ్రద్ధలతో కొలిచే కాళికామాత అమ్మవారి ఆస్తులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చి హిందువుల మనోభావాలను, స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తెలియజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 400 వందల చరిత్ర ఉన్న ఆలయ భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందని సుప్రీంకోర్టు, హైకోర్టు, పరిధిలో ఈ ఆలయ భూములకు హైడ్రాధికారులు అత్యుత్సాహంతో నోటిసులిచ్చి స్థానిక ప్రజలను, అమ్మవారి దర్శనానికి వెళుతున్న భక్తులను ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం తెలుసుకుని అమ్మవారిని ఈరోజు స్థానిక నాయకులతో దర్శించుకుని స్థానిలకు ధైర్యం కల్పిస్తూ, ఆలయాల జోలికొస్తే హైడ్రా అయినా, ప్రభుత్వం అయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో చర్చించి పెద్ద ఎత్తున ఆలయ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని హైడ్రాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు దర్శన్ సింగ్, కైలాస్ సింగ్, శివ సింగ్,కన్నయ్య లాల్, భారతీయ జనతా పార్టీ నాయకులు రాధాకృష్ణ యాదవ్,ఎల్లేష్ తిరుపతి, వరలక్ష్మి, కవిత, కిషన్ ,గోపాల్, సంకేశ్, బాలాజీ, మహేందర్, సుమన్,శూలాల్,అరుణ్, మొదలగురు పాల్గొన్నారు