శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో నంద్యాల MP బైరెడ్డి శబరి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. MP శబరి ఆత్మకూరు పర్యటనలో స్థానిక MLA బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో కాకుండా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ని వెంట పెట్టుకుని పర్యటించడం క్షేత్రస్థాయిలో వివాదానికి కారణమైంది.ఈ పరిణామంతో MLA బుడ్డా అనుచరులు ఆగ్రహానికి లోనై MP శబరి ని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి పై దాడికి దిగారు. ప్రతాప్ రెడ్డి నివాసాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాల MP బైరెడ్డి శబరి పై దాడి యత్నం
Published On: July 4, 2025 7:58 pm
