నందమూరి బాలకృష్ణ అన్ స్టాపెబుల్ షూటింగ్ ..

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపెబుల్ షూటింగ్ లో పాల్గొన్న అభిమానులు 

యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు జనగామ తిరుపతి 

IMG 20241010 WA0087

నటసింహ నందమూరి బాలకృష్ణ గారి వ్యాఖ్యానం తో నిర్మాత అల్లు అరవింద్ గారి ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో వస్తున్న అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బి కే సీజన్ 4 కార్యక్రమం యెుక్క షూటింగ్ బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో జరిగింది అని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు జనగామ తిరుపతి తెలిపారు. దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు అని అన్నారు. ఈరోజు జరిగిన షూటింగ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారి తల్లి గారు కూతురు కొడుకుతో సహా పాల్గొన్నారు అని తెలిపారు. ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాంతం బాలకృష్ణ ఎనిర్జిటిక్ గా కనిపిస్తూ అభిమానులను అలరించారు. బాలయ్య బాబు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో సమాధానం చెప్తు కార్యక్రమాన్ని రక్తి కట్టించారు అని అన్నారు. త్వరలో ఆహా ఓ టీ టీ లో ప్రసారం అయ్యే ఈకార్యక్రమం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అని అన్నారు. అనంతరం అభిమానులను ప్రతిఒక్కరిని నటసింహ నందమూరి బాలకృష్ణ పలకరించి ఫోటోలు దిగి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని సమాజానికి ఉపయోగా పడే కార్యక్రమాలు అభిమానులు చేయాలి అని పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి అని అభిమానులను ఉద్దేశించి నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి అయినా మరిన్ని గొప్ప చిత్రాలు తెస్తాను అని అన్నారు. ఈకార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఒంటెల కామేశ్వర రెడ్డి, యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి, నందమూరి అభిమాన సంగం నాయకులు ఎస్ రాజేశం, కె అశోక్ కుమార్, సతీష్ కుమార్ గౌడ్, క్రిష్ణ, సాగర్, సిరిసిల్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now