మైనార్టీ మహిళ ఆసియాను వేధిస్తున్న పద్మావతిపై చర్యలు తీసుకోవాలి. నంది విజయలక్ష్మి

IMG 20240810 WA0069 1

మైనార్టీ మహిళ ఆసియాను వేధిస్తున్నటువంటి పద్మావతి పై చర్యలు చేపట్టాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు.విలేకరి అంటూ, మహిళా నాయకురాలు అంటూ మహిళలను వేధించడం ఏంటని నంది విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి పద్ధతి మార్చుకోకపోతే మహిళలు ఏకమై తగిన గుణపాఠం నేర్పుతారని ఆమె హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే ఆసియా భర్త హుస్సేన్ ఎమ్మిగనూరు పట్టణ జూనియర్ ఫస్టు క్లాసు మేజిస్ట్రేట్ కోర్టులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.గత మూడు సంవత్సరాలుగా హుస్సేన్ తో పరిచయం ఏర్పరచుకొన్న పద్మావతి అతనితో చనువుగా తిరుగుతూ స్నేహంగా ఉంటూ వచ్చింది. పద్మావతి చేసిన వాట్సాప్ మేసేజ్ లు, వారు తీసుకున్న ఫోటోలు వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతుందని ఆమె అన్నారు. హోంగార్డు హుస్సేన్ ను అన్నయ్యగా భావించానని ఈ రోజు తన వెంటపడుతున్నాడని, తనపై హత్యాయత్నం చేయాడానికి ప్రయత్నించాడని పద్మావతి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసు బనాయించి హోంగార్డు హుస్సేన్ ను సస్పెండ్ చేయించడం జరిగిందని ఆమె తెలిపారు. తన భర్త ఉద్యోగం పోవడం వలన పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక, ఇంటి బాడుగ కట్టుకోలేక, ఇల్లు గడవక ఆసియా బాధపడుతుందని ఆమె అన్నారు. పద్మావతితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించిన మధ్యవర్తులపై కూడా కేసు పెట్టడం చూస్తే పద్మావతి అహంకారపూరిత ధోరణి ఏంటో తెలుస్తోందని ఆమె తెలిపారు. ఆసియా చేసే న్యాయ పోరాటానికి యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక అండగా వుంటుందని ఆమె తెలిపారు.అనంతరం బాధితురాలు ఆసియా మాట్లాడుతూ తన భర్తతో పద్మావతి స్నేహంగా తిరిగి ఈరోజు తప్పుడు కేసులు పెట్టి కుటుంబాన్ని వేధించడం ఎంతవరకు సరియైనది అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి పెట్టిన తప్పుడు కేసుపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని ఆసియా వేడుకున్నది..

Join WhatsApp

Join Now