మరో వివాదంలో మాజీ మంత్రి పేర్ని నాని
Mar 12, 2025,
మరో వివాదంలో మాజీ మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ : వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మరో వివాదంలో చిక్కుకున్నారు. మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయంలో రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ కార్యాలయం వద్ద ఉన్న డ్రైనేజీపై ర్యాంప్ నిర్మించారు. దీనిపై మున్సిపల్ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఆఫీసుకి టౌన్‌ప్లానింగ్ అధికారులు, పోలీసులు చేరుకోవడంతో అక్కడి స్థానికంగా వాగ్వాదం జరిగింది. అక్రమ కట్టడమని నాకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదని నాని పోలీసులకు తెలిపారు.