కామారెడ్డిలో ఘనంగా నారాయణ గురు జయంతి
జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో నారాయణ గురు జయంతి వేడుకలు
సామాజిక పునర్నిర్మాణంలో విశేష కృషి చేసిన మహానుభావుడని స్మరణ
“ఒకే కులం – ఒకే మతం – ఒకే దేవుడు” అన్న గురువు బోధనల ప్రాముఖ్యతపై ప్రసంగం
అక్షరాస్యతకు, సామాజిక సంస్కరణలకు కృషి చేసిన విప్లవ సేనాని అని కొనియాడు ఉద్యమ నేత
అనేక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పణ
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగష్టు 20
కామారెడ్డి పట్టణంలో బుధవారం నారాయణ గురు జయంతి వేడుకలను జై గౌడ ఉద్యమం ఘనంగా నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ మాట్లాడుతూ సామాజిక పునర్నిర్మాణంలో విశేష కృషి చేసిన మహానుభావుడు నారాయణ గురు అని కొనియాడారు.
“గుడి–బడి–సమాజం అన్నీ సమానమే. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు” అనే ఆయన బోధనలు సమానత్వానికి మార్గదర్శకమని అన్నారు. అక్షరాస్యత పెంపొందించడంలో, సామాజిక సంస్కరణల్లో ఆయన పాత్ర అపారమని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం నాయకులు అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.