విద్యార్థుల వినాయక భక్తికి అద్దం పట్టిన నారాయణ పాఠశాల
ఆకట్టుకున్న గణేశుడి ప్రతిబింబం..!
ప్రశ్న ఆయుధం) నిజామాబాద్, సెప్టెంబర్ 4:
గణేశ్ చతుర్థికి విద్యార్థుల ప్రత్యేక నివాళి. వినాయకుడి ప్రతిబింబం ఆవిష్కరణ.
పాఠశాల యాజమాన్యం ప్రశంసలు.ఆర్మూర్: నగరంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు గణేశ్ నవరాత్రుల సందర్భంగా తమ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. గణనాథుడి 9వ రాత్రిని పురస్కరించుకుని, విద్యార్థులు కలిసికట్టుగా మానవ రూపంలో వినాయకుడి ప్రతిబింబాన్ని ఆవిష్కరించారు. వారి ఈ ప్రత్యేక ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఏజీఎం శివాజీ, ప్రధానోపాధ్యాయురాలు రజనీ కుమారి, వ్యాయామ ఉపాధ్యాయులు మోహన్, మీనాతో పాటు ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. వారి సృజనాత్మకత, భక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమం వినాయక చవితి పండుగకు మరింత శోభను తీసుకొచ్చింది.