ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డీఈఓను సన్మానించిన నారాయణ స్కూల్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డీఈఓను సన్మానించిన నారాయణ స్కూల్

నిజామాబాద్, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం):

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ డీఈఓ పార్శి అశోక్ గుప్తాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ నారాయణ స్కూల్ ఏజీఎం శివాజీ పటేల్, ప్రిన్సిపల్ చందన, జోనల్ కోఆర్డినేటర్ రాకేష్, ఏవో రామకృష్ణ, అశోక్ తదితరులు నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, “విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యం. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణం. ఆయన విద్యారంగానికి చేసిన సేవలు ఎంతోమందికి ఆదర్శం” అని అన్నారు.

కార్యక్రమంలో నారాయణ పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now