నిజామాబాద్ సెప్టెంబర్ 20 ప్రశ్న ఆయుధం
మలేషియా లో యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ దసరా సంబరాలు క్లాసికల్ నృత్య ప్రదర్శన పోటీలకు ఎంపీకైన నారాయణ పాఠశాల విద్యార్థిని శ్రీయాన్షి ని అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్ రజనీ కుమారి మాట్లాడుతు నారాయణ పాఠశాల లో చదువుతోపాటు ఇలాంటి సంస్కృతి కార్యక్రమలు కూడా నేర్పించడం జరుగుతుంది అని అన్నారు. విద్యార్థినినీ తెలంగాణ పాఠశాలల జి. యం. గోపాల్ రెడ్డి, డి. జి. యం. వెంకట రమణారెడ్డి, ఎ. జి. యం. శివాజీ మరియు ఉపాద్యని ఉపాధ్యాయులు అభినందించారు.