మాదక ద్రవ్యాలు–సైబర్ నేరాలపై అవగాహన

మాదక ద్రవ్యాలు–సైబర్ నేరాలపై అవగాహన

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ నవంబర్ 17

 

కామారెడ్డి జిల్లా పరిధిలోని లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, యువత పెడదారి, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. జిల్లాస్పీ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, లింగంపేట సబ్‌ఇన్స్పెక్టర్ దీపక్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

 

సైబర్ నేరాల కోసం టోల్‌ఫ్రీ 1930, మహిళల కోసం ఎల్లారెడ్డి షీ టీమ్స్ సభ్యులు PC శ్రీశైలంలు, WPC సుప్రజా 8712686094 నంబర్‌లను విద్యార్థులకు సూచించారు. అత్యవసర సేవలకు ఢయల్‌–100 వినియోగించుకోవాలని తెలిపారు.

 

డ్రంక్ అండ్ డ్రైవ్, ఫోన్ డ్రైవింగ్, గంజాయి–డ్రగ్స్ వాడకం, మహిళలు–పిల్లలపై నేరాలు, బాల్య వివాహాలు, లైంగిక దాడుల నివారణపై భరోసా టీమ్ అవగాహన కల్పించింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.

 

పోలీస్ కళాబృందం ఇన్‌ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, U. శేషరావు, PC సాయిలు పాటలు, మాటల ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రిన్సిపాల్ నరేందర్, స్టాఫ్ సభ్యులు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, బ్లూ కోట్స్ PC రాజు, HG ప్రకాష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now