*ప్రధానమంత్రి ఆవాస్ యోజన రేషన్ కార్డులలో నరేంద్ర మోడీ ఫోటో లేకపోతే ఆందోళన తప్పదు*
*మాజీ జెడ్పిటిసి శ్రీరామ్ శ్యాo,బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్*
*జమ్మికుంట జనవరి 27 ప్రశ్న ఆయుధం*
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన రేషన్ కార్డులలో నరేంద్ర మోడీ ఫోటో లేకపోతే ఆందోళన తప్పదని జమ్మికుంట మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాలం గడిచిన తర్వాత కూడా వారు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను అమలు చేయకుండా , తెలంగాణకు కేంద్రం అనేక పథకాలు ఇస్తున్నప్పటికీ వాటిని కేంద్రం ఇస్తున్నట్లు చెప్పకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బాతో కాలయాపన చేస్తున్నదని ఇంతవరకు తెలంగాణలో కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా వారు ఎలాంటి అభివృద్ధి చేయని ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు నూతన రేషన్ కార్డులలో నరేంద్ర మోడీ ఫోటో ను పెట్టి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు చేయాలని జమ్మికుంట మండల బిజెపి అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు, జమ్మికుంట మాజీ జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.