తెలంగాణపసుపు రైతులకు నరేంద్ర మోడీ సంక్రాంతి గిఫ్ట్..
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు. పర్చువల్ గా ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ పసుపు రైతులకు నరేంద్ర మోడీ
నిజామాబాద్ జనవరి 15
నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి హోటల్లో పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుండి పర్చువల్ గా జాతీయస్థాయి పసుపు బోర్డ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పసుపు బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు జాతీయ కార్యదర్శి పి.హేమలత, కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి కే సాంగ్ యంగ్ జోమ్ శేర్ప, జాతీయ పసుపు బోర్ డైరెక్టర్ రేమ శ్రీ, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిల తో పాటు భారీగా పసుపు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, తెలంగాణ పసుపు రైతులకు ప్రధానమంత్రి మోడీ సంక్రాంతి గిప్ట్ గా పసుపు బోర్డు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోడీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు 20 రాష్ట్రాలలో పసుపు పంట పండుతుందన్నారు. దేశవ్యాప్తంగా 30 రకాల పసుపు పంట సాగు అవుతుందని, పసుపు రైతులకు మేలు జరిగే విధంగా పసుపు బోర్డు ఏర్పాటు కావడం శుభసూచకమన్నారు. పసుపు బోర్డ్ చైర్మన్ గా గురుతర బాధ్యత మోపడం జరిగిందన్నారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెరవేర్చారని, పసుపు రైతుల తీరకాల వాంఛ నెరవేర్చి నరేంద్ర మోడీకి పాదాభివందనం చేశారు.పసుపు బోర్డ్ చైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ, దేశంలో బిజెపి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ప్రాంతంగా పసుపు అత్యధికంగా సాగుతుందని, గత ఎన్నికల్లో ఇచ్చినా మీ మేరకు పసుపు బోర్డ్ ఏర్పాటు కావడం హర్షించదగ్గ విషయం అన్నారు. తనపై ఉంచిన బాధ్యతను పసుపు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు.ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డిని పలువురు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.