ప్రైమరీ స్కూల్ లో ఫ్లోరింగ్ నిర్మించిన : నరిడికొ వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్.

ప్రైమరీ స్కూల్ లో ఫ్లోరింగ్ నిర్మించిన : నరిడికొ వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్.

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 15: కూకట్‌పల్లి ప్రతినిధి

కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ -2 అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మీనా కుమారి తమ పాఠశాల విద్యార్థులకు సౌకర్యార్థం పాఠశాల ప్రాంగణంలో ఫ్లోరింగ్ కొరకై కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ , నరిడికొ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ని కోరగా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ వారి ఆర్థిక సహాయంతో ఫ్లోరింగ్ నిర్మించి అసోసియేషన్ చైర్మన్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ చేతుల మీదుగా ప్రారంభింపబడినది.

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ బిల్డర్ అసోసియేషన్ వారు ప్రతి ఏటా చేసే సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు ఫ్లోరింగ్ నిర్మించబడినదని , విద్యను బోధించే ఒక వాలంటరీ సంవత్సరం పాటు జీతభత్యం అసోసియేషన్ ద్వారా అందజేయబడుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నరిడికొ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి .లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ కె .వి .ప్రసాద్ రావు, ట్రెజరర్ కొర్రపాటి సుభాష్ బాబు మరియు సభ్యులు డి . కోటేశ్వరరావు, ఎం . పవన్ నాయుడు, కే . లక్ష్మీపతి రాజు, పేరలి ఏబు, కే .శ్రీనివాసరావు మట్ట రమేష్ , కట్ట వెంకట్రావు, అద్దంకి సురేష్, ఎన్ . దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now