Site icon PRASHNA AYUDHAM

హైదర్ నగర్ డివిజన్లోనెలకొన్న సమస్యలపరిష్కారానికి పాదయాత్ర నిర్వహించిన నార్నె శ్రీనివాస రావు

IMG 20250104 WA0083

హైదర్ నగర్ డివిజన్లోనెలకొన్న సమస్యలు మరియు పరిష్కారానికి పాదయాత్ర నిర్వహించిన నార్నె శ్రీనివాస రావు

ప్రశ్న ఆయుధం జనవరి 04: కూకట్‌పల్లి ప్రతినిధి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి ప్రశాంత్ నగర్ ఫేజ్ – 1, ఫేజ్ – 2, కృష్ణవేణి కాలనీ మరియు శ్రీరామ్ నగర్ కాలనీ ల్లో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై HMWSSB DGM, మేనేజర్, లైన్ మెన్ మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

, సాయి ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు ఈ రోజు కాలనీలలో పాదయాత్ర చేపట్టడం జరిగినది అని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు HMWSSB DGM నాగప్రియా , మేనేజర్ ప్రశాంతి గారు, లైన్ మెన్ సాయి ప్రశాంత్ నగర్ ఫేజ్ – 1, ఫేజ్ – 2, కృష్ణవేణి కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version