డ్రైనేజ్ లైన్ పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు
ప్రశ్న ఆయుధం ఆగస్టు 29: కూకట్‌పల్లి ప్రతినిధి
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంటి శాతవాహన కాలని
జల వాయు విహార్, ఆదిత్య నగర్, నిజాంపేట్ మెయిన్ రోడ్, హైదర్ నగర్ కాలనీ ల్లో చేపట్టవలసిన, పెండింగ్ లో ఉన్న సేవరేజ్ పైప్ లైన్ పనులను హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి జిఎం, డిజిఎం, మేనేజర్ మరియు వారి సిబ్బందితో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, వివిధ కాలనీల వారి విజ్ఞప్తి మేరకు హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి అధికారులతో కలసి వివిధ కాలనీ ల్లో పర్యటించి డ్రైనేజ్ లైన్ పెండింగ్ పనులను వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు చెప్పడం జరిగింది అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి జిఎం హరి శంకర్ , డిజిఎం నాగ ప్రియ , మేనేజర్ ప్రియాంక, సూపర్వైజర్ నరేంద్ర వారి సిబ్బంది, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.